ఫొటో ఫీచర్: మాల్దీవుల్లో మాధురి.. లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తోందంటే...
on Apr 2, 2021

మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నేనే జంటను చూడగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా అనిపిస్తుంటారు, వారు తరచూ షేర్ చేసుకొనే ఫొటోలు, వీడియోలు చూస్తుంటే. శ్రీరామ్‌తో పెళ్లి ఫిక్సయ్యే టైమ్‌కు మాధురి బాలీవుడ్‌ను ఏలుతోంది. మాధురిని తొలిసారి కలుసుకున్నప్పుడు ఆమె సూపర్‌స్టార్ అనే విషయం శ్రీరామ్‌కు తెలీదనే విషయం మీకు తెలుసా? అతడిని పెళ్లి చేసుకోవడానికి బాలీవుడ్‌ను వదిలేసిన మాధురి. ఆ తర్వాత వాళ్ల ప్యారడైజ్‌లోకి అరిన్, ర్యాన్ అనే ఇద్దరు పిల్లలు వచ్చారు.

కొద్ది గంటల క్రితం మాధురి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్న ఓ వీడియో నెటిజన్లను, ఆమె ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో భర్త శ్రీరామ్, కొడుకు అరిన్‌తో కలిసి సముద్రంలో ట్యూబ్ రైడింగ్ చేస్తోంది మాధురి. సముద్రపు అలలకు అనుగుణంగా ట్యూబ్ పైకి కిందికి ఊగుతుంటే ముగ్గురూ కేకలు పెడుతూ, అంతనలోనే నవ్వుతూ ట్యూబ్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రైడ్‌ను అందరికంటే ఎక్కువగా అరిన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా, ఈ మూమెంట్స్‌ను శ్రీరామ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ వీడియోకు “Life in the fast lane in the Maldives.” అనే క్యాప్షన్ జోడించింది మాధురి.

దానికంటే ముందు, నిన్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మాధురి షేర్ చేసింది. అందులో ఇద్దరు తమ డిన్నర్ డేట్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. డ్రింక్స్ ఉన్న గ్లాసులతో చీర్స్ చెప్పుకుంటున్నారు శ్రీరామ్, మాధురి. ఆ పిక్చర్‌కు “Nothing like a candlelit dinner. Cheers!” అనే క్యాప్షన్ పెడితే, అదే పిక్చర్‌ను షేర్ చేసిన శ్రీరామ్ “Nothing like toasting to life and love!” అనే క్యాప్షన్ పెట్టారు.

తన కుటుంబంతో జీవితాన్ని మాధురి దీక్షిత్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పడానికి ఈ వీడియో, ఫొటోలే నిదర్శనం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



